సిక్కోలులో మెుదలైన నామినేషన్లు పర్వం..! - mptc nominations in narsannapeta srikakulam district
స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సోమవారం పలువురు అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాలకు తమ నామినేషన్లు వేశారు. నరసన్నపేట ఒకటో ప్రాదేశిక నుంచి వైకాపా తరపున ఆరంగి మురళీ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.అదే విధంగా ఇచ్ఛాపురం మండలం బిర్లంగి నుంచి వైకాపా అభ్యర్థిగా బాకీ తులసి నామినేషన్ దాఖలు చేశారు