తెలిసీ తెలియని వయసులో ఆ బాలికల జీవితంలో అంధకారం ఏర్పడింది. తమ తోటి వారు తల్లిదండ్రులతో ఆనందంగా గడుపుతుంటే వీరికి మాత్రం విధి ఆ ఆనందాన్ని దూరం చేసింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన స్వాతి, పల్లవి తల్లిదండ్రులు లేక అనాథలయ్యారు.
నౌపడ గ్రామానికి చెందిన కొంచాడ యుగంధర్, ఉషారాణి దంపతులు గ్రామంలో పాన్ షాప్ పెట్టుకుని జీవనోపాధి పొందుతుండే వారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఉన్నంతలో పిల్లలతో ఆనందంగా జీవిస్తుండేవారు. మూడు నెలల క్రితం తల్లి ఉషారాణి ఆకస్మికంగా మృతి చెందింది. కొన్నాళ్లుగా తండ్రి యుగంధర్ అనారోగ్యంతో ఉన్నారు. వైద్యం చేయించుకునేందుకు డబ్బుల్లేక ఆదివారం ఆయన మృతిచెందారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో ఇద్దరు బాలికలు అనాథలయ్యారు. పెద్దకుమార్తె స్వాతి తొమ్మిదో తరగతి, చిన్న కుమార్తె పల్లవి ఏడో తరగతి చదువుతోంది. దాతలు స్పందించి బాలికలను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రపతికి పదో తరగతి కుర్రాడు లేఖ.. ఎందుకంటే?