ముఖ్యమంత్రి జగన్... రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పూండి రైల్వే గేట్ వద్ద పూండి-పర్లాఖిమిడి రాష్ట్ర హైవే విస్తరణ కార్యక్రమానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రూ. 25 కోట్లతో నువ్వల రేవు నుంచి టెక్కలిపట్నం వరకు రహదారి విస్తరణ పనులు జరుగుతాయన్నారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ కట్టుబడి ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. అందులో భాగంగానే.. రాష్ట్రంలో భవనాలు లేని పంచాయతీలకు రూ. కోటి రూపాయలు ముఖ్యమంత్రి మంజూరు చేశారని గుర్తుచేశారు.
ఇదీ చదవండి...
ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో సుప్రీం తీర్పుని స్వాగతించిన రాజధాని రైతులు