Minister Dharmana Prasad Rao: ‘‘తెదేపా నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారి వద్దకు వెళ్లి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారి మాటలు నమ్మి అర్హులెవరైనా ప్రభుత్వ పథకాలు వద్దనుకుంటే.. చెబితే తొలగించేస్తాం’’ అని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పొన్నాం పంచాయతీలో ఆదివారం గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.
‘ప్రభుత్వం ఇష్టానుసారంగా డబ్బులు పంచేస్తోందని తెదేపా కార్యకర్తలు కొందరు చెబుతున్నారు. వారి మాటలు నమ్మి మీరు ఎన్నికల్లో ఓట్లు వేస్తే బోడిగుండే మిగులుతుంది. మేము అమలు చేస్తున్న ఆసరా, విద్యాదీవెన, అమ్మఒడి పథకాలన్నీ నిలిపివేస్తారు. పొన్నాం గ్రామ ప్రజలు చాలా కష్టపడి నాలుగు సార్లు నాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయినా కూడా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తున్నాం. ఈసారైనా ఆలోచించండిరా నాయనా.. ఓటు వేయండిరా.. మీకు ఎక్కడా అన్యాయం చేయలేదు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతాం..’ అని మంత్రి ధర్మాన గ్రామస్థులను కోరారు.
ఇదీ చదవండి:
"సీఎంవో ముట్టడి"కి యూటీఎఫ్ పిలుపు... భగ్నం చేసేందుకు పోలీసుల విశ్వప్రయత్నాలు