శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించి... లాక్డౌన్ కారణంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న వలసదారులకు గుడారాలు ఏర్పాటు చేసి వారిని అందులో ఉంచారు. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలతోపాటు జిల్లాలోని పలు మండలాలకు చెందిన వారిని ఇక్కడ ఉంచారు.
రాత్రి నుంచి తనిఖీ కేంద్రం వద్ద నిరీక్షిస్తున్నామని, కనీసం త్రాగునీరు, ఆహార సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వలసకార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండతీవ్రతకు తట్టుకోలేక పలువురు చిన్నారులు, గర్భిణిలు అవస్థలు పడుతున్నారు. తమను తమ రాష్ట్రాలకు పంపాలని వలసదారులు పోలీసులను వేడుకుంటున్నారు. విశాఖపట్టణం నుంచి వచ్చిన వారిని తప్ప మిగిలిన అందరినీ బస్సుల్లో వారివారి గ్రామాలకు పంపించి పునరావాస కేంద్రాల్లో ఉండే విధంగా చర్యలు చేపడుతామని సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.
ఇవీ చదవండి