శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వెండి రేకుపై సోనూసూద్ చిత్రాన్ని చెక్కారు. వెండితో తయారు చేసిన భారత చిత్రపటంలో సోనూసూద్ చిత్రాన్ని చెక్కి ప్రతిభ కనబరిచారు. దీన్ని తయారు చేయడానికి 60 నిముషాల సమయం పట్టినట్లు కళాకారుడు ముగడ జగదీశ్ చెప్పారు. మొత్తం 1.220 మిల్లీ గ్రాముల వెండితో దీన్ని తయారు చేశారు.
కొవిడ్ కష్టకాలంలో సోనూసూద్ విలువైన సేవలు చేశారని జగదీశ్ ప్రశంసించారు. వలస కూలీల తరలింపుతో పాటు పేదలకు అండగా నిలిచారన్నారు. సోనూసూద్‌కు బహుమతిగా ఈ చిత్రాన్ని పంపనున్నట్లు జగదీశ్ చెప్పారు. ఆయన గతంలో దేశ రాజకీయ, ప్రముఖ సినీ హీరోల చిత్రాలను సుద్దముక్కలు, పెన్సిల్ మొనలు, స్వర్ణ రేకులపై చేతితో చెక్కి అబ్బుర పరిచారు.
![micro artist show Familiarity on sonu soodh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-sklm-91-16-sukshambaarathmaplosonusud-av-ap10141_16062021083021_1606f_1623812421_186.jpg)
ఇదీ చదవండి: