శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం వేణుగోపాలపురంలోని వైద్య విద్యార్థుల బృందం.. నిరుపేద కుటుంబాలకు ఆపన్నహస్తం అందించింది. కేర్ క్లబ్ బృందం వైద్య విద్యార్థి దుర్గాసి జ్యోతి ప్రకాష్, తెదేపా నాయకులు డి.రామారావు ఆధ్వర్యంలో 350 కుటుంబాలకు రూ.లక్ష విలువ చేసే నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులు మోహనకృష్ణ, సుజిత్, కిషోర్ బాబు, గౌతమ్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: