వైకాపా కార్యాలయాలకు మరో నాలుగు నెలల్లో తాళాలు వేస్తారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో.. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షునిగా కూన రవికుమార్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్బంగా తెదేపా కార్యకర్తలకు ముఖ్యనేతలంతా దిశానిర్ధేశం చేశారు.
గ్రామ గ్రామానా తిరిగి వైకాపా పతనానికి నాంది పలుకుతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: