శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం వంగర తోటల్లో బుధవారం అత్యంత ప్రమాదకరమైన కింగ్‌కోబ్రా హల్చల్ చేసింది. శ్రీనివాస్ అనే రైతు కూరగాయలు కోసేందుకు వెళ్లగా.. 12 అడుగుల పామును చూసి ఆందోళనకు గురయ్యాడు. వెంటనే స్థానికులకు విషయం తెలియజేయగా.. వారు పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. అనంతరం పామును పట్టి సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు.
ఇవీ చూడండి...
'జగన్ డైరెక్షన్లో అనిశా ఒత్తిడితోనే అచ్చెన్నాయుడు డిశ్చార్జ్'