ETV Bharat / state

మేము పేదోళ్లమే... మా భూములెందుకు లాక్కుంటున్నారు..? - Kancharam sc farmers protest news

శ్రీకాకుళం జిల్లా కంచరాం గ్రామంలో పలువురు రైతులు ఆందోళన చేపట్టారు. దశాబ్దాల కిందట తమకు ప్రభుత్వం ఇచ్చిన భూములను ఇప్పటి ప్రభుత్వం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తోందని పలువురు ఎస్సీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల కోసం పొలాలను చదును చేసే పనులకు ఉపక్రమించిన రెవెన్యూ అధికారులను అడ్డుకోవటంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

కంచరాం గ్రామంలో ఎస్సీ రైతుల ఆందోళన
కంచరాం గ్రామంలో ఎస్సీ రైతుల ఆందోళన
author img

By

Published : Mar 5, 2020, 11:26 PM IST

కంచరాం గ్రామంలో ఎస్సీ రైతుల ఆందోళన

ఇళ్ల స్థలాల కోసం భూములు లాక్కోవద్దంటూ శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కంచరాం గ్రామంలో పలువురు రైతులు ఆందోళన చేపట్టారు. భూములు చదును చేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి తాము ఆ భూములు సాగు చేస్తున్నామని.. ప్రభుత్వం వాటిని లాక్కోవడం సరికాదని వారు వాపోయారు. ఈ క్రమంలో అధికారులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న రాజాం సీఐ సోమశేఖర్​ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇదీ చూడండి:

అమరావతిలో ఉచిత ఇళ్ల పట్టాలకు కార్యాచరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.