ETV Bharat / state

'ఇంటర్‌ ఆన్‌లైన్‌ మూల్యాంకనంలో.. నవీన్‌ మిట్టల్‌కు రూ.6కోట్ల ముడుపులు'

Inter JAC Chairman Was Angry Naveen Mittal: తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్‌ ఆన్‌లైన్‌ మూల్యాంకనంలో గ్లోబరినా సంస్థకు ముడుపులు తీసుకుని.. అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇంటర్‌ ఐకాస ఛైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. ఇంటర్‌ బోర్డు మాజీ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ముడుపులకు కారకులు ఈ నవీన్‌ మిట్టల్‌నే అని ధ్వజమెత్తారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 7, 2023, 10:18 PM IST

Inter JAC Chairman Lashed Out At IAS Naveen Mittal: తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్‌ బోర్డు మాజీ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఆరు కోట్ల ముడుపులు తీసుకున్నారని తెలంగాణ ఇంటర్‌ విద్యా ఐకాస ఛైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంటర్‌ ఆన్‌లైన్‌ మూల్యాంకనంలో గ్లోబరినా సంస్థకు మారు పేరుతో అంటగట్టే ప్రయత్నం చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కోట్ల రూపాయలకు ఈ కాంట్రాక్టు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు.

గ్లోబరినా సంస్థకు క్లీన్‌ చిట్‌ ఇచ్చేందుకు మరో రూ.3కోట్ల ఒప్పందం చేసుకున్నారని వివరించారు. గతంలో ఈ సంస్థ వల్ల 10లక్షల మంది విద్యార్థులు అగమయ్యారని.. 20 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు. ఫ్రీ బిడ్డింగ్‌ మీటింగ్‌కు కాంపెక్టు సంస్థ వచ్చిందా లేదా అనే విషయంపై నవీన్‌ మిట్టల్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఈ నెల 9వరకు బిడ్‌లకు చివరి గడువు ఉందని.. ఆ కంపెనీ బిడ్‌ వేసిందా లేదా బయటపెట్టాలని ప్రశ్నించారు. రూ.6 కోట్ల ముడుపులకు నవీన్‌ మిట్టల్‌ గ్లోబరినా సంస్థకు అనుకూలంగా పని చేస్తున్నారని.. ఈ సంస్థకు, కాంపెక్టు సంస్థకు సంబంధం లేదని నిరూపించాలని డిమాండ్‌ చేశారు. గ్లోబరినాకు సీఈఓ వీఎస్‌ఎన్‌ రాజునే ఈ కాంపెక్టు సంస్థ సీఈఓ కూడా ఆయనే స్పష్టం చేశారు.

నవీన్ మిట్టల్ నేను చెప్పినవి తప్పని.. ఇంటర్ బోర్డు కమిషనర్ కార్యాలయంలోని అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేయాలని.. తాను కూడా ప్రమాణం చేయడానికి సిద్ధమే అని సవాల్‌ విసిరారు. తక్షణమే ఇంటర్ బోర్డు వ్యవవహరంపై ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపించి.. నవీన్ మిట్టల్​పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఐఏఎస్‌ నవీన్‌మిట్టల్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఇంటర్‌ ఐకాస ఛైర్మన్‌

"ఈ నవీన్‌ మిట్టల్‌ అక్రమాలు చూసి చూడనట్లు ఉంటున్నారనే.. అపప్రధమం రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంపై విచారణ జరిపించండి. మూడు నెలల్లో ఈ వ్యవహారంపై సమగ్రమైన దర్యాప్తు జరపాలి. పరీక్షలు, రెవెన్యూ గాలికి వదిలేసి.. కేవలం మధుసూదన్‌రెడ్డి మీద మాత్రమే కక్ష సాధించావు. మళ్లీ ఇంటర్‌ మూల్యాంకనాన్ని గ్లోబరిన చేతిలో పెట్టి విద్యార్థుల జీవితాలను బలిగొనవద్దు. విద్యాశాఖ మంత్రి పై అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నాయి." - మధుసూదన్‌రెడ్డి, ఇంటర్‌ విద్యా ఐకాస ఛైర్మన్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.