శ్రీకాకుళం జిల్లాలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీగా కురుస్తోన్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిరమండలంలో మార్కెట్ వీధిలో గత రెండు రోజులుగా మురుగునీరు వస్తున్నా..అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. లక్ష్మీపురం, పెద్ద రొంపివలస, నేతేరు, రాయిలింగారిపేట, నేదురుపేట గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఆదపాక వద్ద పెద్దగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున 15 గ్రామాల మధ్య రాకపోకలకు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. పత్తి, మొక్కజొన్న, తదితర వాణిజ్య పంటలు సర్వనాశనం అయ్యాయి. పంటలు నష్టపోయిన తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:మాడుగులలోని జలాశయాల నుంచి భారీగా నీటి విడుదల