రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల స్తంభాలు నేలకొరిగాయి.
సిక్కోలులో భారీగా వాన
శ్రీకాకుళం జిల్లా రాజాం, ఆమదాలవలసలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రాజాం నియోజకవర్గంలోని రేగిడి, సంతకవిటి, వంగర మండలాల్లో తేలికపాటి వాన పడింది. ఆమదాలవలసలో ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని సరుబుజ్జిలి, బూర్జ, పాలకొండ, సీతంపేట, వజ్రపుకొత్తూరు, వీరఘట్టం మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది.
నెల్లూరులో కూలిన హై టెన్షన్ విద్యుత్ స్తంభాలు
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వర్షంతో పాటు వడగళ్లు పడ్డాయి. బాలాయపల్లి మండలం పిగిలాము, జార్లపాడు మధ్య హై టెన్షన్ విద్యుత్ స్తంభాలు రెండు చోట్ల కూలిపోయాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇదీ చూడండి: