ETV Bharat / state

Financial Assistance: అమర జవాను కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం

శ్రీకాకుళం జిల్లాకు చెందిన అమర జవాను కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. సరిహద్దులో గతేడాది మృతి చెందిన లావేటి ఉమామహేశ్వరరావు కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు.

Financial Assistance
అమర జవాను కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం
author img

By

Published : Jul 13, 2021, 8:51 PM IST

శ్రీకాకుళం జిల్లాకు చెందిన అమర జవాను కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. గతేడాది లద్దాఖ్‌లో మందుపాతర పేలి వీరమరణం పొందిన ఉమామహేశ్వరరావు కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు.

బాంబులు నిర్వీర్యం చేస్తూ..

పాక్ సరిహద్దు సమీపంలో పాకిస్థాన్​కు చెందిన బాంబులు నిర్వీర్యం చేస్తున్న క్రమంలో ఉమామహేశ్వరరావు గతేడాది వీరమరణం పొందారు. ఆర్మీలో బాంబ్ స్క్వాడ్ విభాగంలో ​ఆయన విధులు నిర్వహించేవారు. దేశ రక్షణకై విధులు నిర్వర్తిస్తూ అమరుడైన వీర జవాన్​​కు నివాళులర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరూ రాలేదని అప్పట్లో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్..జవాను కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత కథనం

అమర వీరుడుకి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.