Giant Shark Fish: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో.. మత్స్యకారుల వలకు భారీ నల్ల సొరచేప చిక్కింది. మరువాడ గ్రామ సమీపంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో ఈ చేప చిక్కింది.
సముద్రంలో నుంచి వలను లాగే ప్రయత్నం చేయగా.. భారీగా బరువు ఉండటంతో అతి కష్టం మీద ఒడ్డుకు తీసుకువచ్చారు. సొర చేపగా గుర్తించి సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టారు.
ఇది వేల్ షార్క్ అని.. అంతరించిపోతున్న షార్క్ జాతుల్లో ఇదొకటని టెక్కలి అటవీశాఖ రేంజ్ అధికారి పీవీ శాస్త్రి తెలిపారు. ఈ చేప సుమారు 15అడుగుల పొడవు, 600కిలోల బరువు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.
ఇదీ చదవండి: