శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం బంజీరు పేట గ్రామ సమీపంలోని సాయి హర్షవర్ధన్ జూట్ ప్రైవేట్ లిమిటెడ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమీపంలోని చెత్త కుప్పకు పెట్టిన మంటలు పరిశ్రమకు వ్యాపించాయి. అక్కడి గోనె సంచులు, ఇతర ఉత్పత్తులకు నిప్పు అంటుకుంది.
సామగ్రిని బయటకు తరలించేందుకు కార్మికులు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... మూడు వాహనాల ద్వారా మంటలు అదుపుచేశారు. ఇదే పరిశ్రమలో జనవరిలో విద్యుదాఘాతంతో.. ప్రమాదం జరిగింది.
ఇదీ చూడండి:
ఉక్కు ఉద్యమం.. విశాఖ రావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే గంటా ఆహ్వానం