ETV Bharat / state

వీరఘట్టంలో అగ్ని ప్రమాదం.. 11 పూరిళ్లు దగ్ధం - fire accident at viraghattam newsupdates

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల కేంద్రంలోని గొల్లవీధిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 11 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

11 purils were burnt in the fire
అగ్నిప్రమాదంలో 11 పూరిళ్లు దగ్ధం
author img

By

Published : Jan 5, 2021, 5:19 PM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల కేంద్రంలోని గొల్లవీధిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పాలకొండ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించేందుకు స్థానికులు ప్రయత్నించారు. కార్యాలయం ఫోన్​ నెంబర్ పనిచేయని కారణంగా.. స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

యువకులు సమీపంలోని మురుగు కాలువలో ప్రవహిస్తున్న నీటిని మంటలను అర్పేందుకు వినియోగించారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక శకటం కాస్త ఆలస్యంగా చేరుకున్నా.. చివరికి మంటలు అదుపు చేసింది. అప్పటికే నష్టం జరిగిపోయింది. బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఆస్తి నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

ఐపీఎస్ అధికారుల సంఘానికి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.