ETV Bharat / state

ఎచ్చెర్ల నియోజకవర్గం రైతులకు కన్నీటిని మిగిల్చిన 'ఫొని' - ఫొని తుపాను

ఫొని తుపాను శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రైతులకు ఫొని భారీ నష్టాన్ని మిగిల్తింది. పెను గాలులతో సుమారు 700 ఎకరాల్లో పలు రకాల పంటలు నేల మట్టమయ్యాయి.

ఎచ్చెర్ల నియోజకవర్గం రైతులకు కన్నీటిని మిగిల్చిన 'ఫొని'
author img

By

Published : May 4, 2019, 6:07 AM IST

శ్రీకాకుళం జిల్లాలోని రైతులకు ఫొని కన్నీటిని మిగిల్చింది . ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడం మండలాల్లో బొప్పాయి, చెరకు, అరటి, మొక్కజొన్న, వరి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పెనుగాలులకు చేతికందివచ్చిన బొప్పాయి పంట నేలపాలు కావటంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. సుమారుగా 700 ఎకరాల్లో పలు రకాలు పంటలు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు.
తాగునీటికి ఇక్కట్లు...

గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నియోజకవర్గంలో 48 గంటలగా విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో ప్రజలు తాగునీటికి అల్లాడిపోయారు. చేతి పంపులను తొలగించి వాటి స్థానంలో విద్యుత్ మోటార్లు అమర్చినందువల్ల విద్యుత్ ఉంటేనే తాగునీరు వచ్చే పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికి అధికారులు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయలేదని ప్రజల ఆరోపిస్తున్నారు.

మేకలు మృత్యువాత...

వజ్రపు కొత్తూరు మండలం నగరంపల్లిలో ఫొని గాలుల తీవ్రతతో స్థానిక ఉన్నత పాఠశాల రేకులు పాడైపోయాయి. బెండి గ్రామంలో తుపాను ప్రభావంతో 16 మేకలు మృత్యువాతపడ్డాయి.

New Delhi, May 03 (ANI): BJP's North West Delhi candidate Hans Raj Hans replied on Aam Aadmi Party (AAP) allegations by saying, "If Aam Aadmi Party will not apologise. I will file a defamation case and put SC/ST act on them." Aam Aadmi Party on Thursday alleged that BJP's North West Delhi candidate Hans Raj Hans had converted to Islam and can't fight from a reserved seat and they will move court to disqualify Mr Hans. The BJP denied the allegation and demanded an apology from AAP.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.