Water Problem in Tekkali: శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతంలోని ప్రజలు కలుషిత నీటి సరఫరాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2016లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రూ.22.25 కోట్లతో ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత నీటి పథకాన్ని మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఆ ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత నీటి పథకం ద్వారానే ప్రస్తుతం టెక్కలి పట్టణంతో పాటు.. మండలంలోని మరో 22 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ పథకం నిర్వహణను ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ప్రజలకు కలుషిత నీరు సరఫరా అవుతుంది.
Water Problem: గొంతెండుతోంది.. మండువేసవిలో మన్యంవాసుల దాహం కేకలు..
ఈ సమగ్ర నీటి పథకం సరఫరాలో భాగంగా పైప్ లైన్లను మురుగు కాలువల నుంచి వేడయంతో బురద, పురుగుల వచ్చే ఆ కాలుషిత నీటినే వినియోగిస్తూ రోగాల బారిన పడుతున్నామని టెక్కలి అంబేడ్కర్ వీధి వాసులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తమ ప్రాంతానికి వచ్చినప్పుడు.. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు అంబేడ్కర్ వీధి వాసులు తెలిపారు.
కానీ ఈ విషయంపై ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు పేర్కొన్నారు. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసిన కొళాయిలు తప్ప తమకు అదనంగా ఏ మేలు జరగలేదని వారు తెలిపారు. ఇంటింటికీ కొళాయిలు వేస్తామంటున్నారు తప్ప ఆ దిశగా పనులు జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు.
Water Problem: బిందె నీటి కోసం.. 3 కిలోమీటర్లు నడిచి.. 3 గంటలు నిరీక్షించి
"సమగ్ర నీటి పథకం కింద ఏర్పాటు చేసిన తాగు నీటి పైపులైన్లను మురుగు కాలువల నుంచి వేయడంతో నీరంతా డ్రైనేజీలోని వ్యర్థాలతో కలిసి కాలుషితం అవుతోంది. దీంతో కాలనీలో నివసించే వారు తరచూ ఆనారోగ్యం పాలవుతున్నారు. దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి మా సమస్యలు అన్నింటిని పరిష్కరించాలని కోరుకుంటున్నాను".-బాలమ్మ, స్థానికురాలు
"మురుగు కాలువకు దగ్గర్లో తాగు నీటి పైపుల్లెన్లు ఏర్పాటు చేయడంతో ఆ నీరు కాలుషితం అవుతోంది. దీంతో ఆ నీరు తాగిన మేమంతా ఆనారోగ్యం పాలవుతున్నాం. మా సమస్యలపై ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇంటింటికీ కొళాయి ఇస్తారని కోరుతున్నాను". -కుమారి, స్థానికురాలు
బిందెడు నీటి కోసం.. బండెడు కష్టం.. మహిళల మధ్య 'కన్నీటి' యుద్ధం.. మన రాష్ట్రంలోనే!
"ఇంటింటికీ నీటి పైపు లైను ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఏ పని జరగలేదు. మా వీధిలో ఉన్న ప్రభుత్వ తాగునీటి పైపులైన్ మురుగు కాలువలో ఉంది. దాంతో నీరు పట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. మా పక్కన ఉన్న అన్ని వీధులకు తాగునీటి పైపులైన్లు వేశారు. కానీ మా వీధిలో వేయలేదు". -మంగమ్మ, స్థానికురాలు
"మురుగు కాలువలో నీటి పైపు లైన్ ఉండటం వల్ల నీరు పట్టుకునే సమయంలో బురద, పురుగులు కూడా నీటితో వస్తున్నాయి. దీంతో ఆ నీటిని వడపోసుకోని తాగుతుంటాం మేము. దీనిపై అధికారులకు ఎన్నో సార్లు విన్నవించుకున్నాం.. కానీ వారు ఈ సమస్యపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయం గురించి స్థానిక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా చెప్పాం. ఆయన కూడా దీనిపై స్పందించలేదు". -సుజాత, స్థానికురాలు
Water problem in Krishna district పక్కనే కృష్ణా.. మరో వైపు గోదావరి.. తాగునీరు లేక దాహం కేకలు..!