శాంతియుత మార్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలన్నదే.. తమ ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా వైకాపా కార్యాలయంలో ప్రస్తుత పరిణామాలపై.. జిల్లా మంత్రులతో పాటు ముఖ్య నాయకులతో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. చర్చల అనంతరం మాట్లాడిన కృష్ణదాస్.. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైకాపా సిద్దంగా ఉందన్నారు. ప్రతిపక్షం వారిలా.. తాము బెదిరింపులకు పాల్పడలేదని అన్నారు. అచ్చెన్నాయుడు భవిష్యత్తు కోసం జోస్యం చెప్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన వారిలోనే పోటీ ఉందనీ.. పార్టీ నుంచి ఒకరి నుంచి నలుగురు పోటీ పడుతున్నారన్నారని కృష్ణదాస్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఈ - వాచ్ యాప్.. ఆవిష్కరించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ