గత నెల 18న పాకిస్థాన్ సరిహద్దులో బాంబును నిర్వీర్యం చేస్తూ మృతి చెందిన ఆర్మీ జవాన్ లావేటి ఉమామహేశ్వరరావు కుటుంబాన్ని శ్రీకాకుళంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పరామర్శించారు. జవాన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఉమామహేశ్వరరావు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. ఆయన భార్య నిరోషాకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 350 గజాల ఇంటి స్థలం, ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పారు. కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు.
ఇదీ చదవండి