శ్రీకాకుళం పెద్దపాడు రహదారిలో దేవాదాయశాఖకు సంబంధించిన స్థలంలోని అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. కొన్నా వీధిలోని భీమేశ్వరస్వామివారి ఆలయానికి సంబంధించిన స్థలంలో.. కొన్నేళ్లుగా ఓ ఆక్రమణదారుడు స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. కోర్టు తీర్పు సైతం లెక్కచేయకుండా.. అదే స్థలంలో రేకుల షెడ్డు నిర్మించాడు. దీంతో పోలీసు, రెవెన్యూ, దేవాదాయశాఖల సమన్వయంతో కట్టడాన్ని కూల్చివేసినట్లు దేవదాయ శాఖ సహాయ కమిషనర్ హరిసూర్యప్రకాశ్ తెలిపారు. ఈ స్థలం విలువ సమారు 20 కోట్లు ఉండొచ్చని వెల్లడించారు. అలాగే జిల్లాలోని దేవాదాయ, ధర్మాదాయశాఖలకు సంబంధించిన అస్తులను ఎవరైన అక్రమించుకుంటే ఇదే తరహాలో చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
'దేవాలయాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు' - srikakulam district revenue department lands news update
దేవాలయాలు, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. దేవదాయ శాఖ సహాయ కమిషనర్ హరిసూర్యప్రకాశ్ తెలిపారు. శ్రీకాకుళం పెద్దపాడు రహదారిలో దేవదాయశాఖకు సంబంధించిన స్థలంలో ఉన్న అక్రమకట్టడాన్ని అధికారులు కూల్చేశారు.