విశాఖ జిల్లా నర్సీపట్నం వైద్యుడు సుధాకర్‌పై పోలీసుల వైఖరి అమానుషమని.. శ్రీకాకుళం జిల్లా దళిత హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు బెవర రాము అన్నారు. సుధాకర్‌పై దాడిని ఖండిస్తూ నరసన్నపేటలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దళితుడైన డాక్టర్‌ను నడిరోడ్డుపై చేతుల వెనక్కు పెట్టి దాడి చేయడం దారుణమని విమర్శించారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి.. బస్సు ఉంది.. ప్రయాణికులే లేరు!