శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పాతనౌపడా గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ కూర్మాపు చిన్ని... ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండు రోజుల క్రితం చిన్ని.. మరో నలుగురితో కలిసి ఆమదాలవలస చేరుకున్నారు. అనంతరం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి టెక్కలి సమీపంలోని జగతిమెట్ట వద్దకు రావాలని సమాచారం ఇచ్చారు.
చిన్ని సమాచారంతో జగతిమెట్టకు చేరుకున్న కుటుంబసభ్యులు... జవాన్‌కు ఫోన్ చేశారు. చరవాణి స్విచ్ఆఫ్ కావడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు.. చిన్ని కోసం గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో నందిగాం మండలంలోని జాతీయ రహదారి పక్కన మృతదేహం పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గుర్తింపు కార్డుల ఆధారంగా మృతి చెందిన వ్యక్తి సీఆర్‌పీఎఫ్ జవాన్ చిన్నిగా గుర్తించారు. అనంతరం మృతదేహానికి టెక్కలి జిల్లా ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.