కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపుతూ శ్రీకాకుళంజిల్లా పాలకొండ నగర పంచాయతీలోని ఇందిరానగర్ సచివాలయం ఎదురుగా సిపిఎం నిరసన చేపట్టింది. లాక్ డౌన్ ప్రజల ప్రయోజనాల కంటే కార్పొరేట్ ప్రయోజనాలకే ఉపయోగపడే విధంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు.
నెలకు రూ.7500లు చొప్పున ప్రతి కుటుంబానికి 6 నెలలు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం, ప్రతి మనిషికి నెలకి 10 కిలోల చొప్పున 6 నెలలు బియ్యం సరఫరాతో పాటుగా సంవత్సరానికి 200 రోజులు ప్రతి కుటుంబానికి ఉపాధిహామీ పనిదినాలు కల్పించాలన్నారు.
పట్టణాల్లో ఉపాధిహామీ పనులు అమలు చేయాలన్నారు.నిరుద్యోగ భృతి ప్రకటించి అమలు చేయాలని,కార్మిక చట్టాలను రద్దు చేయవద్దని కోరారు. ప్రైవేటీకరణ ఆపాలని తదితర సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎ.లక్ష్మణరావు,కె.రాము, ఎస్. నారాయణరావు,ఎం. రమేష్, జి.హేసుందరరావు, డి.దుర్గారావు,ఎం. వీరంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి