కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దని ఎస్పీ అమిత్‌బర్దార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని డే అండ్ నైట్ కూడలిలో ప్రజలకు కొవిడ్‌పై అవగాహన కల్పించారు. మాస్కులు అందించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినవారి నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తామన్నారు.
ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసిందన్నారు. అనంతరం కొవిడ్ నిబంధనలపై ప్రతిజ్ఞ చేయించారు. హోలీ పండుగ నిరాండంబరంగా జరుపుకోవాలని కోరారు. శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర, ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు, సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: