శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని నగర పంచాయతీ కమిషనర్ ఎం.రామారావు పర్యవేక్షించారు. కౌంటింగ్ ప్రక్రియలో 30 మంది సిబ్బందిని నియమించారు. ఇప్పటికే కౌంటింగ్‌కు సంబంధించిన శిక్షణ పూర్తిచేశారు.
ఉదయం ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెటలు లెక్కిస్తారు. అనంతరం నగర పంచాయతీలోని 18వార్డుల్లో పోలైన ఓట్లను రెండు రౌండ్లలో లెక్కింపు పూర్తిచేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
ఇదీ చూడండి: