పొట్ట కూటి కోసం శ్రీకాకుళం జిల్లా నుంచి మచిలీపట్నం వెళ్లిన కూలీలు... లాక్‌డౌన్ కారణంగా మూడు వారాలుగా పనులు లేక, తిండి అందక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కాలినడకన స్వస్థలాలకు బయలు దేరారు. వందల కిలోమీటర్లు నడుస్తూ.. గురువారం దివాన్‌చెరువు ప్రాంతానికి చేరుకున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారిని గుర్తించి స్థానికులు ఆహారం అందించారు.
విశాఖ జిల్లాలోని బచ్చులూరులో తెలంగాణలోని పాల్వంచకు చెందిన ఏడుగురు కూలీలు చిక్కుకున్నారు. పనుల్లేకపోవడంతో ఆకలితో అలమటిస్తూ అక్కడ ఉండలేక 180 కి.మీ దూరంలోని స్వగ్రామాలకు కాలినడకన బయలుదేరారు. సామగ్రిని మోసుకుంటూ 50 కి.మీ నడిచి గురువారం మోతుగూడెం చేరుకున్నారు. వాహనాలు లేకపోవడంతో గమ్యం చేరేందుకు నడకనే నమ్ముకున్నామని వారు చెప్పారు.
ఇదీ చదవండి: రోడ్డెక్కితే 4 గంటలు అక్కడ కూర్చోవాల్సిందే!