రెండో దశ కరోనా వ్యాప్తి.. శ్రీకాకుళం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది మార్చి 15 నాటికి 1.64గా ఉన్న పాజిటివిటీ రేటు.. సోమవారానికి ఏకంగా 29.4కు చేరుకుంది. ఒక సమయంలో ఇది గరిష్ఠంగా.. 35 శాతానికి చేరుకుంది. జిల్లాలో ఆదివారం గరిష్ఠంగా.. 16 వందల 80 కొత్త కేసులు వెలుగుచూశాయి. జిల్లాలో ప్రస్తుతం 12 వేల 229 యాక్టివ్ కేసులున్నాయి.
కంటైన్మైంట్ జోన్ల ఏర్పాటు..
కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్న దృష్ట్యా.. జిల్లా అధికారులు కట్టడి చర్యలకు ఉపక్రమించారు. కేసులు అధికంగా నమోదవుతున్న చోట్ల కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకే దుకాణాలు మూసేయాలని సోమవారం.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. బాధితుల కోసం ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సహా ఇతర వసతులు సిద్ధం చేస్తున్నారు.
జిల్లా నుంచి మహారాష్ట్ర, గుజరాత్, చెన్నై సహా పలు ప్రాంతాలకు వలస వెళ్లిన వారు.. ఆయా ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండటంతో.. తిరిగొస్తున్నారు. వీరి రాకపోకలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కూడా జిల్లాలో కేసుల పెరుగుదలకు కారణమవుతోందని పలువురు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:
కాశీబుగ్గలో అమానుషం.. ద్విచక్రవాహనంపై మహిళ మృతదేహం తరలింపు..