శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో బయో మెడికల్ పరికరాల సర్వీసింగ్ , నిర్వహణ అంశాలపై విశాఖపట్నం సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ మేరకు ఆదివారం నుంచి విచారణ కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఇప్పటికే విచారణ చేపట్టారు.
టెక్కలిలోని జిల్లా ఆస్పత్రి, కోట బొమ్మాళిలోని సామాజిక ఆస్పత్రి, సంతబొమ్మాళి మండలం పరిధిలోని బోరు భద్ర, దండు గోపాలపురం ప్రాథమిక ఆరోగ్య సెంటర్లో బుధవారం దర్యాప్తు నిర్వహించారు. సీఐడీ సీఐ దాడి మోహనరావు ఆధ్వర్యంలో వైద్య పరికరాలు, రికార్డులను పరిశీలించారు.
ఉన్నతాధికారులకు నివేదిక..
2015- 18 ఏళ్ల మధ్య టీబీఎస్ సంస్థ బయోమెడికల్ వైద్య పరికరాల సర్వీసింగ్ బాధ్యతలు నిర్వహించింది. సంబంధిత సంస్థ నిర్వహణపై ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ చేపట్టారు. అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి : బాబాయ్‌ని హత్య చేసిన వారిని పట్టుకోవాలని జగన్‌కు లేదా..?