శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నడిమికెల్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఓట్లేశారు. క్యూలో నిలబడి తమ నాయకుడిని ఎన్నుకున్నారు. ఉపాధ్యాయుల సూచనలతో..ఎన్నికలను విజయవంతం చేశారు. ఏంటా అనుకుంటున్నారా..! వారి స్కూల్లో విద్యార్థి నాయుకులను ఎంచుకునే ప్రక్రియలో భాగమే..ఇదంతా. మూడు నుంచి ఎనిదిమిదో తరగతి పిల్లలంతా ఈ వినూత్న కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాలెట్ పత్రాలతో ఓటు వేశారు. విద్యార్థి దశ నుంచే ఎన్నికల నిర్వహణపై ఓ అవగాహన రావడం కోసం... ఇలా చేశామని టీచర్లు వివరించారు.
ఇవీ చదవండి..ఓటు వేద్దాం - ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటుదాం!