శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామంలో రైతులంతా కలిసి రూ.5 లక్షలు పోగుచేసి చెక్ డ్యాం పనులను ప్రారంభించారు. గత ఏడాది వచ్చిన తుపానుకు డొంకూరులో ఉన్న చెక్ డ్యాం కొట్టుకుపోయింది. ఈ కారణంగా.. అన్నదాతలకు ఇబ్బందులు తప్పలేదు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్ళినా ఫలితం లేకుండా పోయింది.
ఇంకో నెల రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో డొంకూరు, బర్జపాడు, పెద్ద లక్ష్మీపురం, చిన్నలక్ష్మీపురం, శివ కృష్ణాపురం గ్రామానికి చెందిన అన్నదాతలు చేయి చేయి కలిపారు. ఐదు లక్షల నిధులు పోగు చేశారు. వీటితో చెక్ డ్యాం పనులు ప్రారంభించారు. ఆ ప్రాంతాల్లో ఉన్న ఐదు వందల ఎకరాల పంట పొలాలకు ఇది నీటిని అందిస్తుంది.
ఇదీ చదవండి: