పోలీసుల తీరుపై భాజపా నేత విష్ణువర్దన్‌రెడ్డి మండిపడ్డారు. పోలీసులకు జీతాలు ఇస్తోంది వైకాపానా.. రాష్ట్ర ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. పోలీసుల దమనకాండపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సోము వీర్రాజు అరెస్టు అప్రజాస్వామికమన్నారు. ఏపీలో ప్రభుత్వం, పోలీసుల వైఫల్యంతోనే వరుస ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి, ఇతర నేతలను చర్చకు రావాలని సవాల్ విసిరారు. రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని విష్ణువర్దన్‌రెడ్డి ఆరోపించారు.
గృహ నిర్బంధాలు అప్రజాస్వామికం: జనసేన
జనసేన నేతలు, శ్రేణుల గృహ నిర్బంధాలు అప్రజాస్వామికమని ఆ పార్టీ నేతల నాదెండ్ల మనోహర్ అన్నారు. ధర్మయాత్రను శాంతియుతంగా చేపట్టిన విషయాన్ని పోలీసులు గుర్తించాలని కోరారు. హిందూ ఆలయాలపై దాడులు సాగుతుంటే ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని మండిపడ్డారు. ఆలయాల విధ్వంసాన్ని పక్కదోవ పట్టించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
ఇదీ చదవండి: రామతీర్థం జంక్షన్‌లో ఉద్రిక్తత.. సోము వీర్రాజు అరెస్టు