శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం కొండవలస పంచాయితీ ఎన్నికల లెక్కింపు అనంతరం బ్యాలెట్ బాక్సుల అపహరణ, బాక్సులు కాల్చివేత ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మూడో విడత ఎన్నికల్లో భాగంగా కొండవలస పంచాయతీల్లో ఎన్నికలు సజావుగా జరిగాయి. ఓట్ల లెక్కింపు అనంతరం అభ్యర్థి ప్రకటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.
కొంతమంది వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోనికి చొరబడి బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లి పోయారు. వీటిలో ఒక బాక్స్ ని రాత్రి పూర్తిగా దగ్ధం చేయగా... మరొకటి పాక్షికంగా కాల్చివేశారు. మరో ఆరు పెట్టెల ఆచూకీ లభించలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బలగాలు నుంచే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం పోలింగ్ కేంద్రం సమీపంలో ఉన్న చెరువులో నాలుగు బాక్స్ లభించగా, గ్రామ సమీపంలో ఉన్న బావిలో రెండు బాక్సులను గుర్తించారు. వీటిని పోలీసులు రేగిడి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అనుమానితుల పై కేసు నమోదు
కొండ వలస గ్రామంలో బ్యాలెట్ బాక్సులను అపహరణకు పాల్పడిన, బాక్సులు కాల్చివేసిన సంఘటనకు సంబంధించిన అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
ఇదీ చూడండి. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో అనూహ్య పరిణామాలు..