దేశంలో కరోనా వ్యాప్తి అధికమవుతోంది. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం కరోనా వైరస్ నిర్మూలనకై వినూత్న ప్రదర్శన చేపట్టింది. రాజాం అంబేడ్కర్ కూడలి వద్ద కరోనా వైరస్ చిత్రాన్ని రంగులతో తీర్చి దిద్దారు. కరోనా అంతమే మా పంతం అంటూ నినాదాలు చేపట్టి వినూత్న ప్రదర్శన చేపట్టారు. కరోనా వైరస్ నిర్మూలనకు నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న లాక్ డౌన్‌కు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమై సామాజిక దూరాన్ని పాటించాలని తెలిపారు .
ఇవీ చూడండి