శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణస్వామి వారి ఆలయంలో హుండీని లెక్కించారు. అలయ అనివెట్టి మండపంలో.. అలయ ఈవో హరి సూర్యప్రకాష్ పర్యవేక్షణలో లెక్కింపు పక్రియ సాగింది. జూలై పదో తేదీ నుంచి ఇప్పటివరకు భక్తులు వేసిన కానుకులను వేరు చేశారు. దీనిలో 16,02526 రూపాయిల నగదు చేకూరింది. అలాగే 19 గ్రాముల బంగారంతో పాటు, కేజీ ఐదు గ్రాముల వెండిని కూడా భక్తులు స్వామివారికి సమర్పించారు. ఎప్పటిలాగే స్వామి వారికి భక్తులు సమర్పిస్తున్న వెండి, బంగారు కళ్లు నమోనాలు పరిశీలించి అధికారులు.. నకిలీగా గుర్తించి బయట పారవేశారు.
ఇవీ చూడండి...