శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వాసుపత్రిలో పుణ్యవతి అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. నందిగాం మండలం గోకన్నపల్లికి చెందిన పుణ్యవతి... అనారోగ్యం పాలవటంతో గురువారం సాయంత్రం పలాస ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయానికి వైద్యులు లేక... సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే... పుణ్యవతి మృతి చెందిందని కుటుంబీకులు ఆసుపత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు స్థానికుల జోక్యంతో మృతదేహాన్ని కుటుంబీకులు ఆస్పత్రి నుంచి తీసుకెళ్లారు.
ఇదీ చూడండి: బాలుడిగా తప్పిపోయి.. యువకుడిగా ఇంటికి చేరాడు.. కానీ!