ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సభాపతి తమ్మినేని, మంత్రి ధర్మానతో కలిసి కరోనాపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులపై స్పందించిన ఆయన.. దురదృష్టవశాత్తు సిక్కోలుకు కూడా కరోనా సోకిందన్నారు. సీఎం జగన్.. జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. కాల్‌సెంటర్ ఏర్పాటుతో పాటు టోల్‌ఫ్రీ నెంబరు జిల్లా ప్రజలందరికీ తెలియజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉంటే ప్రజలు స్వయంగా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఆందోళన వద్దు
శ్రీకాకుళం జిల్లాలో 4 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3,576 నెగిటివ్‌గా వచ్చాయని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. 1,445 మంది విదేశాల నుంచి వచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలను జిల్లా అధికారులకు వివరించానన్న ఆయన.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: