ETV Bharat / state

బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. మహిళకు తీవ్ర గాయాలు - srikakulam district crime news

మేడ మీద బట్టలు ఆరవేసే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ నేపథ్యంలో పక్కింట్లో మంటలు చెలరేగాయి. బీరువాలోని బట్టలు, నగదు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాలకొండ పరిధిలోని ఇంద్రనగర్ కాలనీలో జరిగింది.

a woman injured in a current shock at palakonda

author img

By

Published : May 26, 2021, 6:07 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ పరిధిలోని ఇంద్ర నగర్ కాలనీలోని ఓ ఇంట్లో విద్యుదాఘాతంతో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. వీరఘట్టం మండలం విక్రంపూరం గ్రామానికి చెందిన బంగారమ్మ.. శుభకార్యం నిమిత్తం పాలకొండలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఆమె బట్టలు ఆరవేయడానికి మేడపైకి వెళ్లింది. ఈ సమయంలో సమీపంలోని విద్యుత్ తీగలు తగలడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. 60 శాతం మేర ఖాళీపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం తీసుకెళ్లాలని వైద్యులు సూచించినట్లు ఆమె బంధువులు తెలిపారు.

అయితే ఈ ఘటన నేపథ్యంలో పక్కింట్లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. బీరువాలో ఉన్న బట్టలు, నగదు అగ్నికి ఆహుతయ్యాయి.

ఇదీ చదవండి..

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం..ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.