శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొండగూడెం మాజీ సర్పంచ్, వైకాపా నాయకులు కె.సూర్యారావు నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆ గ్రామ వీఆర్వో కుప్పిలి సుశీల సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గురువారం సంతకవిటి తహసీల్దార్ కార్యాలయంలో తనపై అతను దాడి చేసేందుకు యత్నించాడని బాధితురాలు ఆరోపించారు.
గతంలోనూ తనను కులం పేరుతో దూషించారని ఆమె చెప్పారు. దీనిపై సంతకవిటి పోలీస్‌స్టేషన్‌లో రాజాం రూరల్ సీఐ నవీన్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ వీఆర్వోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.