శ్రీకాకుళం జిల్లాల ఎచ్చెర్ల మండలం ఎస్.ఎమ్.పురం పంచాయతీ లింగాలపేటలో సోమవారం విషాదకర ఘటన జరిగింది. గ్రామానికి చెందిన యాగాటి తరుణ్ (11) మరిడమ్మ చెరువులో పడి మృతి చెందాడు. తరుణ్ తన స్నేహితునితో కలిసి ఆడుకుంటూ చెరువు వద్దకు స్నానానికి వెళ్లాడు. అయితే చెరువులో జారి పడి అక్కడికక్కడే మృతిచెందాడు. తరుణ్ స్నేహితుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందటంతో తరుణ్ తల్లి రాజేశ్వరి కన్నీరుమున్నీరైంది. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై ఎస్.ఐ రాజేష్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి