ETV Bharat / state

AOB: ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. నలుగురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం - ఒడిశా

4 Killed, 6 Critical: ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నలుగురు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్రగాయాలైన ఘటన (ఏవోబీ) ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మ‌ల్క‌న్‌గిరి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సైతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి ట్రాక్ట‌ర్‌ను ర‌హ‌దారి ప‌క్క‌నే ఆపి బ‌య‌ట‌కు వెళ్లార‌ని, ఈ క్ర‌మంలో ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి 30 అడుగులు లోయ‌లో ప‌డింద‌ని ప్ర‌త్య‌క్ష‌సాక్షులు వెల్లడించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 4, 2023, 7:26 PM IST

Updated : May 5, 2023, 6:27 AM IST

Four killed in tractor overturn: ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నలుగురు మృతి చెందిన ఘటన ఆంధ్రా-ఒడిశా సరిహద్దల్లో చోటు చేసుకుంది. ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురికి తీవ్ర‌ గాయాలు అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. మరో ఇద్ద‌రf ప‌రిస్థ‌ితి విష‌మ‌ంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితులు చిత్ర‌కొండ ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స‌ పొందుతున్నారు.

ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం

డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించడమే ప్రమాదానికి కారణం: స్థానికులు తెలిపిన వివ‌రాలు ప్రకారం... ఏవోబీలోని మ‌ల్క‌న్‌గిరి జిల్లా చిత్ర‌కొండ బ్లాక్‌లోని క‌టాఫ్ ఏరియాలోని బ‌డ‌ప‌ద‌ర్ పంచాయ‌తీలోని సుమారు 15 మంది గాజులుమామిడి పంచాయ‌తీ తంట్ల‌గుడా గ్రామంలోని ఒకరి అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వ‌స్తున్నారు. ఖ‌రిమ‌ల్ గ్రామ స‌మీపం వ‌ద్ద ట్రాక్ట‌ర్ అదుపుతప్పి బోల్తాప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌ది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిని స‌మీపంలోని ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా అక్క‌డ చికిత్స‌పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మిగతా క్షతగాత్రులను చిత్ర‌కొండ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉండటంతో వీరిని అధికారులు మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మ‌ల్క‌న్‌గిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి ఉంది. డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి ట్రాక్ట‌ర్‌ను ర‌హ‌దారి ప‌క్క‌నే ఆపి బ‌య‌ట‌కు వెళ్లార‌ని, ఈ క్ర‌మంలో ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి 30 అడుగులు లోయ‌లో ప‌డింద‌ని ప్ర‌త్య‌క్ష‌సాక్షులు చెబుతున్నారు. ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడతామని వెల్లడించారు.

విశాఖలో ముగిసిన ఆర్మీ జవాన్ అంతక్రియలు: ఈనెల 3వ తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ జవాన్ సరగడ భరద్వాజ్ (26) విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం చిప్పాడ గ్రామంలో అంతక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. విశాఖ జిల్లా ఆనందపురం జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద ద్విచక్ర వాహనాన్ని బుదవారం తెల్లవారుజామున కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్​పై వెళ్తున్న ఆర్మీ జవాన్ సరగడ భరద్వాజ్(26) మృతి చెందిన విషయం విదితమే. ఇవాళ మృతుడు భరద్వాజ్ స్వగ్రామం చిప్పాడలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో విశాఖ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ సుబేదార్​తో పాటు మరో ఇద్దరు హవల్దార్ స్థాయి అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. మృతదేహానికి జాతీయ జెండా కప్పి పుష్పగుచ్చం ఉంచి అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. జవాన్ మృతి పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భరద్వాజ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 5, 2023, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.