ETV Bharat / state

వైకాపా నేత దారుణ హత్య.. 18 చోట్ల కత్తిపోట్లు.. అధికార పార్టీ నేతల పనే అంటోన్న తల్లి - అధికార పార్టీ నేతలే నా కొడుకును చంపారు తల్లి

Chowluru Ramakrishna Reddy: సత్యసాయి జిల్లాలో వైకాపా నేత రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. సొంత పార్టీ నాయకులే తన కుమారుడిని హత్య చేశారని.. మృతుని తల్లి ఆరోపించారు. ఇంటి సమీపంలో కారును పార్క్ చేస్తున్న సమయంలో మూకుమ్మడిగా వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. గత కొంతకాలంగా రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వర్గీయుల మధ్య తీవ్ర వర్గపోరు చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి హత్యకు గురికావడం.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Chowluru Ramakrishna Reddy
వైకాపా మాజీ సమన్వయకర్త దారుణ హత్య
author img

By

Published : Oct 9, 2022, 10:46 AM IST

Updated : Oct 9, 2022, 11:59 AM IST

YSRCP leader Chowluru Ramakrishna Reddy: సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. వైకాపా అసమ్మతి నేత చౌలూరు రామకృష్ణారెడ్డిని గుర్తుతెలియని.. వ్యక్తులు హత్యచేశారు. బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న రామకృష్ణారెడ్డి ఇంటి సమీపంలో కారును పార్క్ చేస్తున్న సమయంలో వేట కొడవళ్లతో 18 చోట్ల నరికారు. తీవ్ర గాయాలైన రామకృష్ణారెడ్డిని, హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

సొంత పార్టీ నేతలే తన కుమారుడిని చంపారని రామకృష్ణారెడ్డి తల్లి ఆరోపించారు. ఎమ్మెల్సీ,మరికొంత నాయకులు కలిసి.. తన బిడ్డను పొట్టన పెట్టుకున్నారంటూ విలపించారు. ఇటీవల హిందూపురం వైకాపాలో వర్గ విభేదాలు చోటుచేసుకుని ఆగస్టు 15న ఉద్రిక్తత ఏర్పడింది. అప్పుడు చౌలూరు రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వర్గీయుల మధ్య వర్గపోరు తీవ్ర స్థాయికి చేరింది. ఆ వివాదం నెలకొన్న చోటే చౌలూరు రామకృష్ణారెడ్డి హత్యకు గురయ్యారు.

మృతదేహంతో ఆందోళన: హత్యకు గురైన వైకాపా నేత రామకృష్ణారెడ్డి మృతదేహంతోహిందూపురం చౌలూరులో ఆందోళన చెపట్టారు. వైకాపాలో వర్గ విభేదాలతో హత్య చేశారని బంధువుల ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని రామకృష్ణారెడ్డి బంధువుల డిమాండ్ చేశారు.

వైకాపా మాజీ సమన్వయకర్త దారుణ హత్య

ఇవీ చదవండి:

Last Updated : Oct 9, 2022, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.