Victim woman complained to SP: హిందూపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఇంటివద్ద జరిగిన చిన్న గొడవ విషయమై సోమశేఖర్, అఖిల్, అక్కులప్ప అనే ముగ్గురు వ్యక్తులు కక్ష పెంచుకున్నారు. మే 23న ఎవరూలేని సమయంలో ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడగా, మరునాడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తగాదా కింద కేసు నమోదుచేసి ఇంటికి పంపారు. ఆనక మాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ భౌతిక దాడికి దిగడమేకాక, మరోసారి అత్యాచారం చేశారు. వారికి భయపడి బెంగళూరుకు మకాం మార్చగా, ఫోన్ ద్వారా వేధిస్తున్నారు అంటూ ఎస్పీ దృష్టికి తెచ్చారు. తనకు న్యాయం చేయని పక్షంలో ఇక్కడే చనిపోతానంటూ విలపించారు. అయితే, ఈ కేసులో నిందితులను కాపాడేందుకు అదే మండలంలోని ఓ పంచాయతీ సర్పంచి భర్త, వైకాపా నాయకుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక వ్యాపారంలో తనకు సహకరిస్తున్నందున నిందితులపై తక్కువ తీవ్రత గల సెక్షన్లతో కేసులు నమోదు చేయించారన్న అభియోగాలు విన్పిస్తున్నాయి.
ఇవీ చదవండి: