ETV Bharat / state

ధర్మవరంలో ఏ అక్రమం అడ్రస్​ లాగినా అతని దగ్గరే తేలుతోంది: లోకేశ్​ - lokesh fires on dharmavarm MLA kethireddy

Lokesh Fires MLA Kethireddy : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​.. ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై విమర్శలు చేశారు. ఆయన "గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం" పేరుతో పట్టణంలో తిరిగి ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయా? అని తెలుసుకుని తర్వాత వాటిని కబ్జా చేస్తారని లోకేశ్​ విమర్శించారు.

Lokesh Fires MLA Kethireddy
Lokesh Fires MLA Kethireddy
author img

By

Published : Apr 3, 2023, 8:27 PM IST

Lokesh Fires MLA Kethireddy : రాష్ట్రంలో రాజకీయం రోజుకో మలుపుతిరుగుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇవి మరీ అధికమయ్యాయి. మొన్న నెల్లూరు జిల్లా ఉదయగిరి, ఆ తర్వాత సత్యసాయి జిల్లా పుట్టపర్తి, నిన్న పల్నాడు జిల్లా పెదకూరపాడు.. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాళ్లు విసురుకున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాలతో ప్రతి క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేస్తున్న అక్రమాల గురించి తెలుసుకున్నాక.. ఆయన నెంబర్‌ వన్‌ అవినీతిపరుడనే విషయం అర్థమైందని లోకేశ్‌ ఆరోపించారు. ఆయన "గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం" పేరుతో పట్టణంలో తిరిగి ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయా? అని తెలుసుకుని తర్వాత వాటిని కబ్జా చేస్తారని విమర్శించారు. ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఆక్రమించి విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ నిర్మించుకున్నారని లోకేశ్​ ఆరోపించారు. రైతులకు రెవెన్యూ అధికారుల ద్వారా నోటీసులు ఇప్పించి పొలాలను చౌకగా కొట్టేస్తున్నారని మండిపడ్డారు.

ఆధారాలు ఇస్తాం.. చర్యలు తీసుకునే దమ్ము ఉందా: గరుడంపల్లిలో సోలార్‌ప్లాంట్‌కు కేటాయించిన 106 ఎకరాలను కంపెనీ ప్రతినిధుల్ని బెదిరించి తక్కువకు కాజేశారని ధ్వజమెత్తారు. ప్రధాన రహదారికి ఆనుకుని వందల ఎకరాలు కొట్టేసినట్లు విమర్శించారు. ఉప్పలపాడు రీచులో బినామీలను పెట్టుకుని రోజుకు వందల టిప్పర్లలో బెంగళూరుకు ఇసుకను తరలిస్తున్నారని లోకేశ్​ ఆరోపించారు. ముదిగుబ్బలో ఎమ్మెల్యే అనుచరుడు నారాయణరెడ్డి 50 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని.. కావాలంటే ఆధారాలిస్తాం చర్యలు తీసుకునే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. ధర్మవరం పట్టణంలోని బస్టాండు ఎదురుగా ఉన్న సాయినగర్‌ కాలనీని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వివరించారు.

వాటికి ప్లాన్​ చేయలేదా: ప్రతీ రోజూ ధ‌ర్మవ‌రం వీధుల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి యాక్టింగ్.. తమ మంగళగిరి కరకట్ట క‌మ‌ల్​హాస‌న్‌ని మించిపోతోందని లోకేశ్​ ఎద్దేవా చేశారు. ధర్మవరం నియోజ‌క‌వ‌ర్గంలో ఏ అక్రమం అడ్రస్ లాగినా అతని ద‌గ్గరే తేలుతోందని మండిపడ్డారు. ఏ క‌బ్జా క‌దిపినా గుడ్ మార్నింగ్ కేటురెడ్డిదే ‌అని స్పష్టం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్ మార్నింగ్ షూటింగ్‌లో ఎర్రగుట్ట క‌బ్జా, చెరువు పూడ్చి ఫామ్​ హౌస్ క‌ట్టుకోవ‌డం, వంద‌ల ఎక‌రాల క‌బ్జా, చిత్రావ‌తి న‌ది నుంచి ఇసుక మాఫియా ఎపిసోడ్ల స్కిట్ల షూట్‌కి ఎప్పుడూ ప్లాన్ చేయ‌లేదా అని లోకేశ్​ ఎద్దేవా చేశారు.

  • ప్ర‌తీ రోజూ ధ‌ర్మ‌వ‌రం వీధుల్లో నీ యాక్టింగ్ మా మంగ‌ళ‌గిరి క‌ర‌క‌ట్ట క‌మ‌ల్ హాస‌న్‌ని మించిపోతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఏ అక్ర‌మం అడ్ర‌స్ లాగినా నీ ద‌గ్గ‌రే తేలుతోంది. ఏ క‌బ్జా క‌దిపినా గుడ్ మార్నింగ్ కేటురెడ్డిదేన‌ని స్ప‌ష్టం అవుతోంది.(1/2)#GoodMorningMahanatudu #Dharmavaram pic.twitter.com/hoKFIrkRD3

    — Lokesh Nara (@naralokesh) April 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

59వరోజు యువగళం పాదయాత్ర: నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యువనేత పాదయాత్రకు విశేష మద్దతు లభిస్తోంది. వివిధ రకాల సామాజిక వర్గాలతో సమావేశమై.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. 59 వరోజు.. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ముష్టూరు విడిది కేంద్రం నుంచి లోకేశ్ నడక ప్రారంభించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.