ETV Bharat / state

PM Narendra Modi: ప్రేమించండి.. ప్రేమను పంచండంటూ సత్యసాయి ప్రేమ సందేశమిచ్చారు: మోదీ - Sai Hira Global Convention Centre in Puttaparthi

PM Modi Inaugurates Sai Hira Global Convention Centre: ప్రేమించండి.. ప్రేమను పంచండంటూ సత్యసాయి ప్రేమ సందేశమిచ్చారని ప్రధాని మోదీ అన్నారు. సత్యసాయి బాబా తన జీవితాన్నే పేదలకు అంకితం చేసిన తీరు ఆదర్శనీయమన్నారు. పుట్టపర్తిలోని సత్యసాయి సేవా ట్రస్ట్‌ నిర్మించిన.. సాయిహీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను.. ప్రధాని మోదీ దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.

Sai Hira Global Convention Centre
సాయిహీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌
author img

By

Published : Jul 4, 2023, 1:47 PM IST

ప్రేమించండి.. ప్రేమను పంచండంటూ సత్యసాయి ప్రేమ సందేశమిచ్చారు: మోదీ

PM Modi Inaugurates Sai Hira Global Convention Centre: శ్రీసత్యసాయి ట్రస్ట్‌ సేవలు నిరుపమానమని.. ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. పుట్టపర్తిలోని సత్యసాయి సేవా ట్రస్ట్‌ నిర్మించిన.. సాయిహీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను.. ప్రధాని మోదీ దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్‌ నజీర్‌.. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కోట్లమందికి సత్యసాయిబాబా ఆదర్శంగా నిలిచారని.. సేవా మార్గాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని.. ప్రధాని ప్రశంసించారు. జీవితాన్ని పేదలకు అంకితం చేసిన తీరు ఆదర్శనీయమన్నారు.

సత్యసాయి మహాసమాధిని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీబ్ ప్రత్యేకంగా దర్శించుకున్నారు. సాయి కుల్వంత్ మందిరంలో ట్రస్ట్ వర్గాలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత పుష్పగుచ్చాల నుంచి, ప్రత్యేకంగా దర్శించుకున్నారు. దేశంలో ఎక్కడా లభించని మానసిక ప్రశాంతత పుట్టపర్తిలో లభిస్తుందన్నారు. తర్వాత ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభిస్తున్నసాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు.

డిజిటల్‌లోకి మారాలి: సత్యసాయిబాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని మోదీ అన్నారు. పుట్టపర్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం ఒక గొప్ప అనుభూతిగా తెలిపారు. కోట్లమందికి సత్యసాయిబాబా ఆదర్శంగా నిలిచారని.. సత్య సాయిబాబా సేవ మార్గాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని కొనియాడారు. భారత్‌.. ఆధునిక డిజిటల్‌ మౌలిక సదుపాయాలను సృష్టిస్తోందని.. పుట్టపర్తిలోనూ అన్ని కార్యకలాపాలు పూర్తిస్థాయిలో డిజిటల్‌లోకి మారాలని ప్రధాని మోదీ సూచించారు.

సత్యసాయి ప్రేమ సందేశం: ప్రేమ అనే రెండు అక్షరాల్లోనే అనంతమైన శక్తి ఇమిడి ఉందని.. ప్రేమించండి.. ప్రేమను పంచండంటూ సత్యసాయి ప్రేమ సందేశమిచ్చారని ప్రధాని మోదీ అన్నారు. సత్యసాయి బాబా తన జీవితాన్నే పేదలకు అంకితం చేసిన తీరు ఆదర్శనీయమని పేర్కొన్నారు. ప్రపంచానికి ప్రేమ పంచిన మహనీయుడు సత్యసాయి బాబా అని తెలిపారు. సేవాభావనే జీవన విధానంగా సత్యసాయి మార్చుకున్నారని.. మనమంతా మానవ సేవే మాధవ సేవ అని గుర్తించి జీవించాలని సూచించారు.

సత్యసాయి.. తన కరుణ, ప్రేమరసంతో ఎంతోమందిని అక్కున చేర్చుకున్నారని అన్నారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని.. యోగా దినోత్సవం ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసిందని తెలిపారు. సత్యసాయిబాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నానని ప్రధాని ఆకాంక్షించారు.

"అభివృద్ధిని, సేవను ఒకే మార్గంలో తీసుకెళ్తున్నాం. ఈ సేవా కార్యక్రమాల్లో సత్యసాయి ట్రస్ట్‌ సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తోంది. సత్యసాయి బాబా ప్రజా సేవకు ఆస్పత్రుల నిర్మాణం చేశారు. దేశ నిర్మాణంలో, సమాజ స్వశక్తిలో సత్యసాయి సేవలు ప్రశంసనీయం. దేశంలో చేపడుతున్న కొన్ని కార్యక్రమాల తరహాలోనే సత్యసాయి ట్రస్ట్‌ కూడా సేవలు అందిస్తోంది. జల్‌జీవన్‌ మిషన్‌ కింద గ్రామాలకు మంచి నీరు అందిస్తున్నాం. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ కూడా మారుమాల గ్రామాలకు స్వచ్ఛమైన నీరు సరఫరా చేస్తోంది". - నరేంద్ర మోదీ, ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.