ETV Bharat / state

నన్నలా అంటే.. సీఎం జగన్​ను ఇలా అంటాం: పవన్

ప్రతి రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ అన్నారు. అన్నం పెట్టే రైతుకు అండగా ఉండాలనే 'కౌలురైతు భరోసా యాత్ర' చేపట్టామని తెలిపారు. వైకాపా నేతలు తనపై చేసిన వ్యాఖ్యలపై పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'నన్ను సీబీఎన్ దత్తపుత్రుడంటే.. జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడని అంటాం' అని బదులిచ్చారు.

నన్నలా అంటే.. జగన్​ను ఇలా అనాల్సి వస్తుంది

author img

By

Published : Apr 12, 2022, 5:48 PM IST

Updated : Apr 13, 2022, 9:47 AM IST

నన్నలా అంటే.. సీఎం జగన్​ను ఇలా అంటాం: పవన్

అన్నం పెట్టే రైతుకు అండగా ఉండాలనే 'కౌలురైతు భరోసా యాత్ర' చేపట్టామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో యాత్ర ప్రారంభించిన పవన్.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు సాకే రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి ఆయన భార్య సుజాతకు రూ.లక్ష ఆర్థికసాయం చెక్కును అందజేశారు. తన భర్త చనిపోయిన తర్వాత ప్రభుత్వం తరఫున ఎలాంటి సాయమూ అందలేదని.. ఎవరూ పట్టించుకోలేదని పవన్‌ వద్ద సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని పవన్‌ ఆమెకు హామీ ఇచ్చారు. పరామర్శల అనంతరం సాయంత్రం మన్నీల గ్రామంలో పవన్‌ రచ్చబండ నిర్వహించారు.

"మరో దారి లేకపోతేనే రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. గిట్టుబాటు ధర రాక రైతులు అనేక బాధలు పడుతున్నారు. కౌలురైతుల కష్టం కళ్లారా చూశా. కౌలురైతులు అప్పులపాలు అవుతున్నారు. కౌలురైతుల కష్టాలను పంచుకుంటాం. ప్రతి జిల్లా వెళ్లి కౌలురైతుల కుటుంబాలను పరామర్శిస్తాం. ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లల బాధ్యత తీసుకుంటాం. కౌలురైతుల పిల్లల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఎందరు కౌలురైతులు చనిపోయారో మాకు తెలుసు. వైకాపా నేతల వ్యక్తిగత దూషణలను పట్టించుకోను. నాకు స్వార్థం లేదు.. భయం తెలియదు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి.. యువతకు ఉద్యోగాలు కావాలి. అనంతపురం జిల్లాకు పెద్ద పారిశ్రామిక కారిడార్ రావాలి. కౌలురైతులు అందరికీ గుర్తింపు కార్డులు వచ్చేలా చూస్తాం." -పవన్‌, జనసేన అధినేత

అంతకు ముందు మీడియాతో మాట్లాడిన పవన్.. తాను పరామర్శకు వచ్చానని తెలిసి ప్రభుత్వం హడావుడిగా రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.7 లక్షలు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. రైతు కష్టం తెలుసు కనుకే స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నానని తెలిపారు. వైకాపా పాలనలో 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ప్రతి రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం చేస్తుందన్నారు. వైకాపా నేతలపై నిప్పులు చెరిగిన పవన్ తనను సీబీఎన్ దత్తపుత్రుడంటే.. జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడని అంటామని అన్నారు. జనసేనను తెదేపా బి-టీమ్ అంటే.. వైకాపాను చర్లపల్లి షటిల్ టీమ్ అంటామన్నారు. వైకాపా నేతలు దేశం కోసం కాదు.. ఆర్థిక నేరాలు చేసి జైలుకెళ్లారని ఆరోపించారు. వైకాపా వాళ్లకంటే ఎక్కువ తిట్లు తనకూ వచ్చునని దుయ్యబట్టారు.

"నన్ను సీబీఎన్ దత్తపుత్రుడంటే.. జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడని అంటాం. జనసేనను తెదేపా బి-టీమ్ అంటే.. వైకాపాను చర్లపల్లి షటిల్ టీమ్ అంటాం. వైకాపా నేతలు దేశం కోసం కాదు.. ఆర్థిక నేరాలు చేసి జైలుకెళ్లారు. వైకాపా వాళ్లకంటే ఎక్కువ తిట్లు నాకూ వచ్చు. 16 నెలలు జైల్లో కూర్చుని వచ్చిన మీరా నీతులు చెప్పేది."- పవన్‌, జనసేన అధినేత

రైతు కన్నీరు తుడుస్తాం: నేను మాటల మనిషిని కాదు. మేము అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తామని చెప్పం. కానీ రైతు కన్నీరు తుడుస్తాం. నేనూ ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని భావించాను. నా సోదరుడు నాగబాబు ధైర్యం చెప్పడంతో విరమించుకున్నా. అన్నింటికీ ఆత్మహత్య పరిష్కారం కాదు. చనిపోయినవారి కుటుంబాలకు అండగా నిలబడతానని మాటిస్తున్నా. ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు బిడ్డ తనకు ఎస్సై కావాలని ఉన్నట్లు చెప్పింది. మరోబిడ్డ ఇంజినీర్‌ అవ్వాలనుందని చెప్పింది. వారికి నేను అండగా ఉంటాను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 30 కౌలు రైతు కుటుంబాలకు సాయం చేశాం. మళ్లీ చేస్తాం.

ప్రభుత్వం వద్ద వివరాలు లేవు: కౌలు రైతుల పరిస్థితి గురించి రైతుస్వరాజ్య వేదిక అనే సంస్థ మాకు వివరించింది. తర్వాత మా పార్టీ తరఫున అధ్యయనం చేశాం. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల వివరాలు జనసేన వద్ద ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆ వివరాలు లేకపోవడం శోచనీయం. వైకాపా ప్రభుత్వం నన్ను అన్ని విధాలుగా భయపెట్టాలని చూస్తోంది. నాకు భయమంటే ఏంటో తెలీదు. దెబ్బ పడేకొద్దీ రాటుదేలుతాను. పోలీసుశాఖను ప్రభుత్వం తమకు అనుకూలంగా వాడుకుంటోంది. అయితే వారికి న్యాయంగా రావాల్సినవి ఇవ్వడం లేదు. పోలీసులకు రావాల్సిన సరెండర్‌ లీవ్స్‌, అదనపు సరెండర్‌ లీవ్స్‌, ట్రావెలింగ్‌ అలవెన్సులు అందజేయాలి’ అని పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు.

పవన్‌కు వైకాపా సర్పంచి కృతజ్ఞతలు: మన్నీల గ్రామంలో ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచి, వైకాపా మద్దతుదారు త్రిలోక్‌నాయుడు మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చేయూత అందించిన పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తాను సర్పంచిగా కాకుండా రైతుగా మాట్లాడుతున్నానని, 15 ఏళ్లుగా వ్యవసాయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని గుర్తుచేశారు.

వైకాపా అగ్ర నాయకత్వానికి ఒకటే చెబుతున్నా. నేనేమీ విదేశాల్లో చదువుకోలేదు. లండన్‌ రాయల్‌ ఫ్యామిలీ కాదు.. ప్రకాశం జిల్లాలో పెరిగిన వాడిని. మీరు తిట్టే భాష కంటే చాలా మంచి భాష నాకొచ్చు. ఇంకోసారి చెబుతున్నా. నన్ను సీబీఎన్‌(చంద్రబాబునాయుడు)కు దత్తపుత్రుడు అంటే.. మేం మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి ఉంటుంది. మమ్మల్ని తెదేపాకు బీ టీం అంటే మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్‌ టీం అనాల్సి ఉంటుంది. అక్కడ జైల్లో షటిల్‌ ఆడుకున్నారు. మీరేమైనా సుభాష్‌ చంద్రబోష్‌, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌లా దేశసేవ చేశారా? ఆర్థిక నేరాలకు పాల్పడి 16 నెలలు జైల్లో కూర్చుని వచ్చారు. వైకాపాలో చాలామంది నేతలను సీబీఐ దత్తత తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని విమర్శించే స్థాయి మీకు లేదు. మంచో.. చెడో ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. వారి తీర్పునకు కట్టుబడి మీకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను.’- అనంతపురం జిల్లా పూలకుంటలోజగన్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

ఇదీ చదవండి: Pawan Kalyan: పవన్ కల్యాణ్ 'కౌలురైతు భరోసా యాత్ర'.. బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం

Last Updated : Apr 13, 2022, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.