MLA Kethireddy Venkataramireddy: గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ధర్మవరం ఎమ్మెల్యేకు చుక్కెందురైంది. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం అగ్రహారంలో గడపగడపకు కార్యక్రమానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఓ కుటుంబం ప్రభుత్వ పథకాల బుక్లెట్ తీసుకునేందుకు నిరాకరించింది. ఎమ్మెల్యే కేతిరెడ్డి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాల బుక్లెట్ పంచుతున్నాడు. ఈ క్రమంలో శివయ్య అనే వ్యక్తి ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి బుక్లెట్ ఇవ్వగా తీసుకునేందుకు నిరాకరించాడు.
శివయ్య ఇంటికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెళ్తుండగా ఆ ఇంటిపై కట్టిన తెదేపా జెండాను వైకాపా కార్యకర్తలు చూపించారు. శివయ్య ఇంటి వద్దకు వెళ్లి బుక్లెట్ ఎమ్మెల్యే ఇచ్చేందుకు ప్రయత్నించగా తమకు ప్రభుత్వ పథకాలు వద్దని శివయ్య చెప్పాడు. దీంతో ఎమ్మెల్యేతో పాటు వైకాపా నాయకులు అవాక్కయ్యారు. వెంటనే ఎమ్మెల్యే వాలంటీర్ను పిలిచి శివయ్య కుటుంబానికి పథకాలు వద్దంట మీరు ఎందుకు నమోదు చేస్తారని వాలంటీర్ను అడిగారు.
ఇవీ చదవండి: