Ammunition material blast: మందు గుండు సామగ్రి పేలి మహిళకు గాయాలైన ఘటన.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కేతిరెడ్డి కాలనీలో జరిగింది. అశోక్ అనే భవన నిర్మాణ కార్మికుడి ఇంటిలో నిల్వ ఉంచిన మందు గుండు సామగ్రి అటక పైనుంచి కిందపడి పేలటంతో.. ఘటన చోటు చేసుకుంది. మందుగుండు పేలి పెద్ద శబ్దం రావడంతో కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. ఘటనలో అశోక్ భార్య భవాని గాయపడగా.. ఆమెను చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో బాధిత మహిళ వినికిడి కోల్పోయింది.
భవన నిర్మాణ పనులు చేసే అశోక్ కు కాలనీ శివార్లలో ఓ ప్లాస్టిక్ సంచిలో మందు గుండు సామగ్రి దొరికింది. అతను వాటిని తీసుకొచ్చి ఇంట్లోని ఆటకపై ఉంచాడు. అశోక్ భార్య భవాని అటకపై నుంచి కొన్ని వస్తువులు తీస్తున్న సమయంలో.. మందుగుండు సామగ్రి సంచి కిందపడింది. దీంతో పేలుడు సంభవించినట్లు అశోక్ తెలిపారు. ధర్మవరం పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి.. ఘటనపై విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: