ETV Bharat / state

క్లిష్ట సమయాల్లో సత్తా చాటుతున్న యువ వైద్యులు

కరోనా సోకినవారి వద్దకెళ్లి వైద్యం చేయడానికి కొందరు వైద్యులే భయపడుతున్న రోజులివి..! నిన్నమొన్నటి వరకు... కళాశాల జీవితాన్ని ఆస్వాదించిన యువ డాక్టర్లు మాత్రం.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ధైర్యంగా ముందడుగేస్తున్నారు. వైద్యం చేస్తుండటమే కాకుండా.. కొవిడ్ బాధితులను తమ తల్లిదండ్రులుగా భావిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపి కోలుకునేలా చేస్తున్నారు.

క్లిష్ట సమయాల్లో సత్తా చాటుతున్న యువ వైద్యులు
క్లిష్ట సమయాల్లో సత్తా చాటుతున్న యువ వైద్యులు
author img

By

Published : Apr 30, 2021, 6:59 PM IST

క్లిష్ట సమయాల్లో సత్తా చాటుతున్న యువ వైద్యులు

ఇలా విద్యాజీవితం పూర్తైందో లేదో.. వెంటనే కీలకమైన వైద్యవృత్తిలోకి దూకి.. యువ డాక్టర్లు కనబరుస్తున్న తెగువ, పరిణతి, సేవా తత్వం ఎందరినో ఆకట్టుకుంటోంది. దావానలంలా వ్యాపిస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు, రోగులకు సేవలందించేందుకు.. ప్రభుత్వం గతేడాది ప్రత్యేక నియామకాలు చేపట్టింది. ఇలా నియమితులైన యువతే.. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ప్రభుత్వాసుపత్రిలో నిరంతరం సేవలందిస్తున్నారు.

ఈ క్లిష్ట సమయాల్లో మధుమేహం, బీపీ వంటి సమస్యలుండే సీనియర్ వైద్యులు కొవిడ్ వార్డుల్లో నిత్యం తిరగాలంటే వారికీ ఇబ్బందే. రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండి, ఇటీవలే వైద్య పట్టా పుచ్చుకున్న యువ వైద్యులు ఇక్కడ తమ ప్రభావం చూపిస్తున్నారు. ప్రపంచమే తల్లడిల్లుతున్న వేళ.. ఇలా పనిచేస్తుండటం మంచి అనుభవమని, కొవిడ్ బాధితులు కోలుకుని వెళ్తుంటే.. చాలా ఆనందంగా ఉంటోందంటున్నారు.

విధుల్లో చేరేముందు సీనియర్ వైద్యులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించామని.. యువతీ యువకులంతా భయం, అసహనానికి లోనవకుండా చక్కని సేవలందిస్తున్నారని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. సవాళ్ల సమయంలో యువ వైద్యుల సేవను అందరూ అభినందిస్తున్నారు.

ఇదీ చదవండీ.. విద్యార్థుల భవిష్యత్‌ కోసమే పరీక్షల నిర్వహణ: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.